Breaking News

ముహూరత్‌ ట్రేడింగ్‌: ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Published on Tue, 10/21/2025 - 15:19

దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ ఫ్లాట్‌గా ముగిసింది. భారత స్టాక్ మార్కెట్లు ‘సంవత్ 2082’ను జాగ్రత్తగా ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప సానుకూలం వైపు స్థిరపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 62.97 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 84,426.34 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.45 పాయింట్లు లేదా 0.1 శాతం పెరిగి 25,868.60 స్థాయిల వద్ద స్థిరపడింది.

విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.11 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.52 శాతం పెరిగాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో నిఫ్టీ బ్యాంక్, పిఎస్‌యూ బ్యాంక్, రియల్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్ప లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌.

ట్రేడింగ్ సెషన్ లో 2,213 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. 710 తగ్గుముఖం పట్టాయి. ఎన్ఎస్ఈలో 116 షేర్లలో మార్పులేదు. 106 స్టాక్స్ కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకగా, 36 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

దీపావళి రోజున సాధారణ స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలకు సెలవు ఉంటుంది. కేవలం గంటపాటు ముహూరత్‌ ట్రేడింగ్‌ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్‌ నిర్వహిస్తారు. దీన్ని సంప్రదాయంగా, ఒక శుభప్రదమైన కార్యక్రమంగా భావిస్తూ, నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం విక్రమ్ సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)