సెలవున్నా స్టాక్‌ మార్కెట్లు పని చేస్తాయ్‌!

Published on Mon, 10/20/2025 - 17:44

స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్‌ 21న లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మార్కెట్లకు సెలవు. అయినా మధ్యాహ్నం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.

ముహూరత్‌ ట్రేడింగ్

ఈ ముహూరత్‌ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్‌ఈ ముహూరత్‌  ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్‌ఎస్‌ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ  సందర్భంగా  వ్యాపారులు  పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్‌ఎల్‌బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్‌ నిర్వహిస్తారు.

ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌ 21న ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్‌ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్‌లు, ఎనలిస్టులు, బ్రోకరేజ్‌ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్‌ చేస్తారు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్‌ 22న ఎక్స్ఛేంజీలు  పనిచేయవు.

ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం

ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్ సమయాలు

  • అక్టోబర్‌ 21 మధ్యాహ్నం 1:45కు మార్కెట్‌ ఓపెన్‌ అవుతుంది.

  • మధ్యాహ్నం 2:45కు ముగుస్తుంది.

  • అక్టోబర్‌ 22న బలిప్రతిపద సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌ సెలవు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)