Breaking News

మీ నెలవారీ పెన్షన్ ఆగిపోయిందా?

Published on Tue, 07/21/2026 - 13:19

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నుంచి వచ్చే నెలవారీ పెన్షన్ హఠాత్తుగా ఆగిపోయిందా? దానికి ప్రధాన కారణం మీ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రం (జీవన్ ప్రమాణ్) గడువు ముగిసిపోవడమే కావచ్చు. ఏటా పెన్షనర్లు తమ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. మీరు సమర్పించిన తేదీ నుంచి ఏడాది పాటు దీని చెల్లుబాటు ఉంటుంది. అయితే దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా ఇంటి నుంచే దీన్ని సబ్మిట్‌ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చింది.

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ఎలా?

మీ జీవన్ ప్రమాణ్ పత్రం ఇంకా అమలులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘పెన్షనర్స్ పోర్టల్’ ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చు.

జీవన్ ప్రమాణ్‌ను సమర్పించే దశలు..

  • ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 'UMANG' యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

  • ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేసి Jeevan Pramaan Certificate విభాగంలోకి వెళ్లి Generate Life Certificate ఆప్షన్ ఎంచుకోవాలి.

  • తర్వాత Face Authentication క్లిక్‌ చేయాలి.

  • మీ ఆధార్ సంఖ్య, మొబైల్ సంఖ్య నమోదు చేసి ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.

  • ఆ తర్వాత మీ పీపీఓ సంఖ్య, పెన్షన్ మంజూరు చేసిన అధికారి, బ్యాంక్ పేరు, ఖాతా సంఖ్య వివరాలను సమర్పించాలి.

  • పునర్నియామకం (Re-employed), పునర్వివాహం (Remarried) ఆప్షన్లను సరిగ్గా ఎంచుకొని నిబంధనలను అంగీకరిస్తూ Aadhaar Face RD యాప్‌కు కెమెరా యాక్సెస్ అనుమతి ఇవ్వాలి.

  • కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ (Face Scan) చేయడంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

ఉచితంగా ఇంటివద్దే సేవలు

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేని వృద్ధుల కోసం ఈపీఎఫ్‌ఓ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఉచిత డోర్‌స్టెప్ సేవను ప్రవేశపెట్టింది. పెన్షనర్లు టోల్ ఫ్రీ నంబర్ 155299 లేదా 1800 889 7711 కు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేస్తే ఐపీపీబీ డాక్ సేవక్ నేరుగా ఇంటికే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఉచితంగా నమోదు చేస్తారు. పెన్షన్ సజావుగా అందాలంటే గడువు ముగియక ముందే జీవన్ ప్రమాణ్‌ పత్రాన్ని సమర్పించాలి.

ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)