Breaking News

మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?

Published on Tue, 12/23/2025 - 16:07

ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్‌లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్‌లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్‌లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.

ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.

జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.

వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)