Breaking News

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో సైడ్‌ జాబ్‌.. ఏఐతో పట్టుకున్న సీఈవో

Published on Wed, 04/16/2025 - 21:40

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.

లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్‌ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్‌లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టిందని ఆయన తెలిపారు.

ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.

కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ
కంపెనీల​కు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)