దుబాయ్‌పై దాడులు.. బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్‌ ఉందా?

Published on Mon, 03/02/2026 - 13:58

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో (#IranWar) దుబాయ్‌ (Dubai) సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నప్పటికీ, పౌర ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa) వద్ద అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా టవర్‌ను ఖాళీ చేయించారు. ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు బుర్జ్‌ ఖలీఫా సమీపంగా వచ్చినప్పటికీ భవనం నేరుగా దెబ్బతినలేదని తెలుస్తోంది.

బుర్జ్ ఖలీఫాకు బీమా ఉందా?
ప్రస్తుతం జనంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం వెనుక బలమైన బీమా వ్యవస్థ ఉందని తెలుస్తోంది.

బుర్జ్ ఖలీఫా డెవలపర్ అయిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం సమగ్ర ‘ఆల్ రిస్క్’ ప్రాపర్టీ పాలసీని రూపొందించారు. ఈ కోర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌ను ఓమన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేయగా, ప్రధాన రీఇన్సూరెర్‌గా మ్యూనిచ్‌ రీ వ్యవహరించినట్లు సమాచారం.

ఈ పాలసీ ద్వారా సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు  రూ. 13,722 కోట్లు) నిర్మాణ వ్యయాన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. భవనం యాజమాన్యానికి ఇది వర్తించగా, టవర్‌లోని అపార్ట్‌మెంట్లు, హోటల్ ఇంటీరియర్స్, కార్యాలయాలు వంటి వాటికి ఆయా యజమానులు వేర్వేరుగా బీమా తీసుకుంటారు.

యుద్ధ ప్రమాదాలకు వర్తిస్తుందా? 
దుబాయ్‌లోని ఎమ్మార్ యాజమాన్యంలోని ప్రధాన ఆస్తులు సాధారణంగా రాజకీయ హింస, ఉగ్రవాదం, అల్లర్లు, పౌర గందరగోళం, దండయాత్ర, శత్రుత్వం (యుద్ధం ప్రకటించినా, లేకపోయినా), అంతర్యుద్ధం వంటి ప్రమాదాలకు బీమా రక్షణ కలిగి ఉంటాయని బీమా వర్గాల సమాచారం.

అయితే పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చాలాసార్లు పాలసీల్లో మినహాయింపులుగా ఉండే అవకాశముంది. క్షిపణి దాడి వంటి ఘటనలు ‘ఉగ్రవాదం’ లేదా ‘రాజకీయ హింస’ కింద పరిగణిస్తారా? లేక ‘యుద్ధ ప్రమాదం’ కింద వస్తాయా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

బుర్జ్ ఖలీఫా నిర్మాణ వ్యయం సుమారు 1.4 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా అంచనా. ప్రస్తుత కాలంలో ఆ ఖర్చు 3.5 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.32 వేల కోట్లు) ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఈ టవర్ ఆధారంగా అభివృద్ధి చెందిన డౌన్‌టౌన్ దుబాయ్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: ఆ యుద్ధం అందుకే.. కియోసాకి సంచలన ట్వీట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)