Breaking News

వార్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు తప్పని ఇబ్బందులు!

Published on Thu, 03/05/2026 - 18:12

అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాలతోపాటు.. భారతీయ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన బాస్మతి బియ్యం.. ఇప్పుడు ఢిల్లీలోని గిడ్డంగుల్లో నిలిచిపోయింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి.

ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోవడం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం ఓడరేవులు, గిడ్డంగుల్లో ఉన్నట్లు సమాచారం. సుమారు 2,00,000 టన్నుల బాస్మతి బియ్యం రవాణాలో చిక్కుకుపోయినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) అధ్యక్షుడు సతీష్ గోయెల్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు ఇప్పటికే స్టాక్‌లను పోర్టులకు తరలించారు, కానీ పెరుగుతున్న కంటైనర్ సరుకు రవాణా ఖర్చుల కారణంగా మధ్యప్రాచ్యానికి రవాణా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.

భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కలిగిన, ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశం. మన దేశం సౌదీ అరేబియా, ఇరాన్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా మధ్యప్రాచ్యంలో సగానికి పైగా వాటా కలిగి ఉంది.

తగ్గిన ధరలు
2026 ప్రారంభం నుంచి బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో మాత్రమే ధరలు 5-10 శాతం పెరిగాయి. కాగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లకు రవాణా నిలిచిపోయింది. దీంతో ధరలు 10 శాతం పడిపోయింది. మన దేశంలో కూడా బాస్మతి బియ్యం రేటు 5-6 శాతం తగ్గింది. యుద్ధం ముగిస్తేగానీ.. మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)