అమెరికా గ్రీన్ కార్డుల వివాదం.. బ్రాడ్ స్మిత్ హెచ్చరిక!

Published on Fri, 10/16/2026 - 07:53

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు ఇచ్చే విషయంలో.. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు టెక్ రంగంలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులపై ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ స్పందించారు.

బ్రాడ్ స్మిత్ హెచ్చరిక
గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై బ్రాడ్ స్మిత్ ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశీ ఉద్యోగులకు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడే అవకాశాలను తగ్గిస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీ రంగం నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే.. అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకుంటాయి. అలాంటి వారికి అవకాశాలు తగ్గిస్తే.. వారు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోల్పోవచ్చని స్మిత్ అభిప్రాయపడ్డారు.

జేడీ వాన్స్ ఆరోపణ
మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేసిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించారు. దీనిపై స్పందించిన బ్రాడ్ స్మిత్ ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తమ కంపెనీ విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తుందనే వాదనను కూడా ఆయన అంగీకరించలేదు. ఉద్యోగి ఏ దేశానికి చెందినవారైనా, వారి ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా ఒకే విధమైన వేతన వ్యవస్థను అనుసరిస్తామని ఆయన వివరించారు.

9000 మంది అమెరికన్లను ఉద్యోగాలు
అంతేకాకుండా.. మైక్రోసాఫ్ట్ గత ఏడాది 9,000 మందికి పైగా అమెరికాలో జన్మించిన ఉద్యోగులను నియమించుకుందని స్మిత్ తెలిపారు. కాబట్టి.. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నామనే కారణంతో అమెరికా పౌరులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావించడం సరికాదని ఆయన చెప్పాలనుకున్నారు.

గ్రీన్ కార్డు వివాదం.. భారతీయ ఐటీ ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే చాలా మంది భారతీయ నిపుణులు H-1B వీసాల ద్వారా అమెరికాలో పనిచేస్తున్నారు. వారిలో చాలామంది భవిష్యత్తులో గ్రీన్ కార్డు పొంది అక్కడే స్థిరపడాలని ఆశిస్తారు. కానీ.. గ్రీన్ కార్డు ప్రక్రియపై ఆంక్షలు విధిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదీ చదవండి: అమెజాన్‌కు పోటీగా మస్క్ ఈ కామర్స్!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)