Breaking News

ఉచితంగా ‘AI’ నేర్పిస్తాం.. మైక్రోసాఫ్ట్‌ బంపరాఫర్‌!

Published on Fri, 06/30/2023 - 15:43

అందరి నోళ్ళలో నానుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది. ఏఐ’ని సమర్ధవంతంగా వినియోగించేందుకు, ఉపాధి పొందేలా ఉచితంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కోర్స్‌లను నేర్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కోర్స్‌లను లింక్డిన్‌తో కలిసి అభివృద్ది చేసినట్లు వెల్లడించింది. 

జనరేటివ్‌ ఏఐ లెర్నింగ్‌ కంటెంట్‌ పేరుతో ఫ్రీగా నేర్పించే ఈ కోర్స్‌ను ఔత్సాహికులు నేర్చుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. కోర్స్‌ నేర్చుకున్న అనంతరం కెరియర్‌ ఎసెన్షియల్‌ సర్టిఫికెట్‌ సైతం పొందవచ్చు. తద్వారా ఏఐని ప్రొఫెషనల్‌గా మారి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందవచ్చు. 

ఇటీవల భారత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ యువత ఏఐ నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తే సత్తా విషయంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికను విడుదల చేసింది. ఏఐ స్కిల్స్‌, విస్తరించే విషయంలో మొదటిస్థానంలో ఉంది. అయితే, ప్రస్తుతం టాలెంట్‌ ఉన్న 420,000 మంది నిపుణులను పరిగణలోకి తీసుకుంటే ఏఐ/ఎంఎల్‌ బిగ్ డేటా అనలిటిక్స్ టెక్ టాలెంట్‌ల డిమాండ్, సప్లయ్‌ల మధ్య అంతరాయం 51 శాతంగా ఉంది.  

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఏఐ సరికొత్త పని విధానాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉంది. నైపుణ్యం పరంగా వృద్ది సాధించేలా తాము అభివృద్ది చేసిన ఏఐ కోర్స్‌ ఉపయోగపడుతుంది. గత రెండేళ్లలో టైర్ 2, టైర్‌ 3 పట్టాణాల నుండి దాదాపు 70,000 మంది  విద్యార్ధినులు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ పొందారని చెప్పారు.

చదవండి👉 : ‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్‌ మూసివేత!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)