Breaking News

మైక్రోసాఫ్ట్‌ మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్‌ విడుదల

Published on Wed, 10/15/2025 - 13:43

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ(AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ పూర్తిగా అంతర్గతంగా శిక్షణ ఇచ్చిన తన మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ ‘మై ఇమేజ్‌-1(MAI-Image-1)’ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఓపెన్‌ఏఐ (OpenAI)పై ఆధారపడుతుండడాన్ని తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది.

ఫొటోరియలిస్టిక్ ఇమేజరీ

‘MAI-Image-1 మోడల్ ఫొటోరియలిస్టిక్ ఇమేజరీని ఉత్పత్తి చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఫొటోలో లైటింగ్ పరిస్థితులు, నీటిపై ప్రతిబింబాలు, ప్రకృతి దృశ్యాలు అత్యంత వాస్తవికంగా ఉంటాయి. భారీ ఎల్‌ఎల్‌ఎంలు వాడుతూ నెమ్మదిగా అవుట్‌పుట్‌ ఇచ్చే మోడళ్లతో పోలిస్తే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అత్యంత వాస్తవిక అవుట్‌పుట్‌లను సాధించడానికి ఇప్పటికే నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం’ అని కంపెనీ తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ MAI-Image-1 ఇప్పటికే ప్రముఖ ఏఐ బెంచ్‌మార్క్ అయిన ఎల్‌ఎంఅరెనా(LMArena)లో టాప్ 10లో స్థానం సంపాదించింది. LMArenaలో ఏఐ అవుట్‌పుట్‌ల ఆధారంగా వివిధ మోడళ్లను పోల్చి ఉత్తమమైన వాటికి ఓటు వేస్తారు.

ఏఐ ఇమేజ్ జనరేషన్ విభాగంలో ఓపెన్‌ఏఐ (DALL-E), గూగుల్ (Nano Banana) వంటి సంస్థలు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో సంస్థ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓపెన్‌ఏఐ తన సోరా(Sora) 2 టూల్‌ను ఉపయోగించి వీడియోలను సృష్టించే యాప్‌ను ఇప్పటికే అమెరికా, కెనడాలోని యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రారంభించింది.

ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు