Breaking News

24 గంటల్లో 8000 బుకింగ్స్.. ఒకేరోజు 150 కార్ల డెలివరీ

Published on Sun, 05/18/2025 - 14:47

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇటీవల.. 'విండ్సర్ ప్రో' పేరుతో పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ కారు.. కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే.. బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి విండ్సర్ ప్రో డెలివరీలు చేసింది.

ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లను పొందిన ఎంజీ విండ్సర్ ప్రో.. ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు

సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఎంజీ విండ్సర్ ప్రో.. 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)