అధ్యక్ష బరిలో ట్రంప్‌.. మెటా కీలక నిర్ణయం

Published on Sat, 07/13/2024 - 14:42

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్‌పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే.. 

తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది. 

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)