Breaking News

చాట్‌జీపీటీ, గూగుల్‌లకు పోటీగా మెటా ఏఐ.. ఉచిత వెర్షన్‌ విడుదల

Published on Wed, 07/19/2023 - 09:09

ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్‌ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్‌ను విడుదల చేసింది.

ఓపెన్‌ ఏఐ, గూగుల్‌ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ, బార్డ్ చాట్‌బాట్‌లు లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరి​స్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్‌ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా.

ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్‌ ఏఐ, గూగుల్‌లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది.

ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉ‍ద్యోగిని.. ఏం జరిగిందంటే..

"ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్‌లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకునేలా మెటా ఏఐ మోడల్‌ సరికొత్త, శక్తివంతమైన వర్షన్‌ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)