మెటా ఏఐ యూనిట్‌లో 600 మందికి లేఆఫ్స్‌

Published on Thu, 10/23/2025 - 13:31

సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌ కోసం ఇటీవల కాలంలో భారీగా వేతనాలు ఆఫర్‌ చేసిన మెటా తన ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల నుంచి 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. మెటా ప్రతినిధి తాజాగా ఈ పరిణామాలను ధ్రువీకరించారు. మెటా చీఫ్ ఏఐ అధికారి అలెగ్జాండర్ వాంగ్ నుంచి ఉద్యోగులకు అందిన అంతర్గత మెమోలో ఈ తొలగింపులను ప్రకటించారు.

ఈ ఉద్యోగ కోతలు మెటా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు, ఫండమెంటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్ (FAIR), ఇతర ఉత్పత్తి సంబంధిత కార్యకలాపాలను ప్రభావితం చేయనుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ తొలగింపులు మెటా సూపర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌లోని ఉద్యోగులను ప్రభావితం చేయవని చెప్పారు.

600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న కంపెనీ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగాలు కూడా ఇకపై సురక్షితం కాదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ర్యాంక్‌ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)