Breaking News

ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో కొత్త రూల్స్!

Published on Thu, 06/18/2026 - 19:09

డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్‌)లలో కొత్త భద్రతా అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.

మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్‌ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్‌ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.

మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.

టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్‌డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.

తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.

ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)