Breaking News

‘కొత్త’ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు

Published on Sun, 10/19/2025 - 16:57

టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి  జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది.

కావాల్సిన అర్హతలు ఇవే..
మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..

  • కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.

  • అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..

  • సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్

  • PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవం

  • React వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవం

  • లార్జ్‌ స్కేల్‌ స్టోరేజ్‌ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యం

  • iOS సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో ఉండాలి.

జీతం ఎంతంటే.. 
ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.

అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్  మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్‌ ఉండదు.

ఈ అవకాశాల ప్రాముఖ్యత 
ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.

మార్క్ జుకర్‌బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"

కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. చిగురించిన ఆశలు

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు