Breaking News

ఈ పనిచేయండి.. ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్‌?!

Published on Tue, 01/13/2026 - 17:41

వాషింగ్టన్‌: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్‌ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్‌ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్‌‌ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా?  

కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్‌,స్కిల్స్‌,ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు.    

ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్‌ పటేల్‌ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.

అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్‌ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్‌ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్‌. మార్కెట్‌లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.

ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్‌కు సంబంధించిన స్కిల్‌ను బిల్డ్‌ చేశాను. కంటెంట్‌ క్రియేట్ చేయడం, నెట్‌వర్కింగ్‌ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్‌ మలుపు తిరిగింది.

నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్‌,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్‌ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు. 
 

 

#

Tags : 1

Videos

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్..?

Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు

గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా

Kannababu : 8 కేసులు ఎత్తేశారు..ED పెట్టిన కేసులో గోల్ మాల్

విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ

Achanta: ఎమ్మెల్యే సేవలో ఎంపీడీవో.. గుండెపోటు నాటకం?

CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం

Photos

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)