Breaking News

యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు

Published on Tue, 09/02/2025 - 14:53

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్‌మెంట్‌లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్‌తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.

ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.

ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారు

మారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)