Breaking News

'రూ.45 లక్షల వేతనం.. అందుకే వదిలేసా'

Published on Sun, 09/28/2025 - 21:21

కొంతమంది ఎక్కువ జీతం కోసం పనిచేస్తే.. మరికొందరు ఉన్న జీతంతోనే సర్దుకుంటారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక టెక్నీషియన్ ఇటీవల రెడ్డిట్‌లో చేసిన పోస్ట్.. జీతం కంటే పని - జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చర్చకు దారితీసింది.

నాకు రెండు ఆఫర్లు వచ్చాయి, ఒకటి ఏడాదికి 38 లక్షల ప్యాకేజీ. మరొకటి సంవత్సరానికి 45 లక్షల ప్యాకేజీతో భారతదేశంలోని అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అని వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే నేను నా ప్రస్తుత స్థానం గుర్గావ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ (బెంగళూరులో) పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేశానేమో అనే భావన గలుగుతోంది. నేను డబ్బును ఎంచుకోవాలా లేదా స్థిరత్వాన్ని ఎంచుకోవాలా? అని అన్నారు.

రెడ్దిట్ తూజార్ తన కెరీర్ గురించి కూడా వెల్లడించారు. తాను ప్రారంభంలో రూ. 3.8 లక్షల ప్యాకేజితో ఉద్యోగంలో చేరినట్లు, ఆ తరువాత మూడు ఉద్యోగాలు మార్చినట్లు, దీని ఫలితంగా తన ప్రస్తుత వార్షిక జీతం పెరిగిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓ

ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది.. టెక్నీషియన్ ఉద్యోగాన్ని వదులుకోవడం గురించి చింతించవద్దని.. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని చెప్పారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని ఇంకొకరు అన్నారు. మీ జీతం పెరిగిన తరువాత.. పని సంస్కృతి & మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుందనే విషయాన్ని గమనించాలని ఇంకొకరు అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)