Breaking News

ఏప్రిల్‌ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్‌ ఇవే..

Published on Sun, 03/19/2023 - 12:22

2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను కొత్త  నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2023 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను కొత్త నియమాలను ప్రతిపాదించింది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా! 

  • కొత్త పన్ను విధానంలో టీడీఎస్‌ను ప్రభుత్వం తగ్గించింది. దీంతో చాలామంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.  
  • పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువ ఉండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు ఎటువంటి టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద వారికి అదనపు మినహాయింపు ఉంటుంది. 
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193 కింద డీమెటీరియలైజ్డ్ రూపంలో లిస్టెడ్ డిబెంచర్లకు టీడీఎస్‌ కోతలు ఉండవు. అయితే అన్ని ఇతర చెల్లింపులపై 10 శాతం టీడీఎస్‌ రూపంలో కోత ఉంటుంది.
  • ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా డబ్బు గెలుచుకున్న వారు ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  దీన్ని టీడీఎస్‌ రూపంలో కట్‌ చేస్తారు. 
  • ఐటీ చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. రూ. 10 కోట్ల వరకు మూలధన లాభాలకు మాత్రమే ఈ సెక్షన్ల కింద మినహాయింపు ఉంటుంది. అంతకు మించిన మూలధన లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు.
  • 2023 ఏప్రిల్ 1 నుంచి ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై  అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ యాక్ట్‌ సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేసే వడ్డీని కొనుగోలు లేదా మరమ్మతు ఖర్చులో చేర్చేందుకు వీలు లేదు.
  • మార్కెట్ లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ నుంచి వచ్చే మూలధన లాభాలపై ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది.
  • 2023 ఏప్రిల్ నుంచి ఈ-గోల్డ్ రిసీప్ట్‌గా మార్చుకున్న ఫిజికల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్‌గా  ఈ-గోల్డ్ రిసీప్ట్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ ఉండదు. అయితే ఈ మార్పిడి సెబీ రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ ద్వారా జరిగి ఉండాలి.

ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్‌ చేయనున్న ఐఫోన్‌! 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)