Breaking News

యూపీఐ వినియోగంలో టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..

Published on Tue, 08/19/2025 - 12:40

యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్‌బీఐ ఎకనామిక్‌ రిసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్‌టెక్‌ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.

ఎస్‌బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్

విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్‌బీ​ఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)