Breaking News

ఎగ్జిట్‌ పోల్‌ జోష్‌.. కుమ్మేసిన బుల్స్‌

Published on Tue, 06/04/2024 - 05:34

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో మార్కెట్‌ కొత్త శిఖరాలకు పరుగులు తీసింది.  ఎన్‌డీఏ భారీ మెజారిటీని సాధించనుందన్న అంచనా కొనుగోళ్ల జోరుకు దారిచూపింది. ఒక్కసారిగా ఊపందుకున్న పెట్టుబడులతో స్టాక్‌ బుల్‌ లాభాలతో కుమ్మేసింది. దీంతో  సెన్సెక్స్‌ 2,507 పాయింట్ల(3.5 శాతం) పోల్‌వాల్ట్‌ చేసింది. 76,469 వద్ద ముగిసింది. 

నిఫ్టీ 733 పాయింట్లు(3.3 శాతం) ఎగసి 23,264 వద్ద స్థిరపడింది, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. గతంలో 2021 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ రోజున సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున జంప్‌ చేశాయి. అంతక్రితం అంటే 2019 మే 20న సైతం ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్‌డీఏ కూటమి రెండోసారి విజయాన్ని అంచనా వేయడంతో మార్కెట్లు 3 శాతానికిపైగా పురోగమించాయి. ఇంట్రాడేలోనూ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి.

సంపదే సంపద
మార్కెట్లు కదం తొక్కడంతో ఒకే ఒక్క రోజులో స్టాక్‌ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 13.78 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 426 లక్షల కోట్లకు చేరింది. వెరసి సరికొత్త రికార్డ్‌ 5.13 ట్రిలియన్‌ డాలర్లను తాకింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ సైతం 5.09 లక్షల కోట్ల డాలర్ల(రూ. 422.48 లక్షల కోట్లు)కు చేరింది. స్పష్టమైన మెజారిటీతో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతోపాటు.. గతేడాది(2023–24) దేశ జీడీపీ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా 8.2 శాతం వృద్ధిని సాధించడం ఇన్వెస్టర్లకు ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషణ.

రిలయన్స్‌ భళా..
సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 కౌంటర్లు భారీ లాభాలతో నిలవగా.. కేవలం సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఏషియన్‌ పెయింట్స్, నెస్లే, ఇన్ఫోసిస్‌ నామమాత్రంగా డీలా పడ్డాయి. వీటితోపాటు ఇక నిఫ్టీ 50లో ఐషర్, ఎల్‌టీఐఎం, బ్రిటానియా స్వల్ప వెనకడుగు వేశాయి.  ఆయిల్‌ అండ్‌ గ్యాస్, రియలీ్ట, ప్రయివేట్‌ బ్యాంక్స్, మెటల్, మీడియా, ఆటో 7–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. హెవీవెయిట్‌ షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం జంప్‌చేసి మార్కెట్లకు దన్నునిచ్చింది. రూ. 3,021కు చేరడం ద్వారా రూ. లక్ష కోట్ల మార్కెట్‌ విలువను జమ చేసుకుంది. దీంతో మొత్తం మార్కెట్‌ క్యాప్‌  రూ. 20.44 లక్షల కోట్లను దాటింది. షేరు తొలుత రూ. 3,029 వద్ద రికార్డ్‌ గరిష్టానికి చేరింది.  

ప్రభుత్వ షేర్ల పరుగు
తాజా ర్యాలీలో పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు లాభాల పరుగు తీశాయి. దీంతో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, కోల్‌ ఇండియా 9.5–4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో శ్రీరామ్‌ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, అ్రల్టాటెక్, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ త్రయం, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గ్రాసిమ్, కొటక్‌ బ్యాంక్‌ 7–2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోబీ, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌ ఒక దశలో 52 వారాల గరిష్టాలకు చేరాయి. పీఎస్‌యూగా ఎస్‌బీఐ తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధించడం విశేషం!

విదేశీ పెట్టుబడుల జోరు 
బీఎస్‌ఈ నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లుతాజాగా రూ. 6,851 కోట్ల పెట్టుబడులను పంప్‌ చేశారు. డీఐఐలు సైతం రూ. 1,914 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. గత వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,613 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. బీఎస్‌ఈ సూచీలలో మిడ్‌ క్యాప్‌ 3.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 2 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,346 లాభపడితే.. 1,615 మాత్రమే నష్టపోయాయి.

అదానీ షేర్ల మెరుపులు
ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న అంచనాలకుతోడు, జఫరీస్‌    బ్రోకింగ్‌ బయ్‌ రేటింగ్‌తో తాజాగా అదానీ గ్రూప్‌ కౌంటర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్‌ షేర్లు 4% నుంచి 16% వరకు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఫలితంగా గ్రూప్‌లోని మొ త్తం 10 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 19.42 లక్షల కోట్లను అధిగమించింది.

రూపాయి ర్యాలీ 
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ మెజారిటీపై అంచనాలతో స్టాక్‌ మార్కెట్లతోపాటు దేశీ కరెన్సీ సైతం జోరందుకుంది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 28 పైసలు బలపడింది. తద్వారా 2023 నవంబర్‌ 15 తదుపరి(24 పైసలు) ఒకే రోజు రూపాయి అత్యధికంగా పుంజుకుంది. వెరసి రెండు నెలల గరిష్టం 83.14 వద్ద ముగిసింది. ఇంతక్రితం మార్చి 21న 83.13 వద్ద నిలిచింది. 

ఉత్పత్తిని యథాతథంగా కొనసాగించే ఒపెక్‌ నిర్ణయంతో చమురు ధరలు బలహీనపడటం సైతం రూపాయికి ప్రోత్సాహాన్నిచి్చనట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 83.09 వద్ద హుషారుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82.95 వద్ద గరిష్టాన్ని తాకగా.. 83.17 వద్ద కనిష్టానికీ చేరింది. చివరికి 83.14 వద్ద స్థిరపడింది. వారాంతాన రూపాయి 13 పైసలు నీరసించి 83.42 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు, జీడీపీ, జీఎస్‌టీ గణాంకాలు సైతం రూపాయికి దన్నునిచి్చనట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

Videos

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)