Breaking News

కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్‌ఫుల్‌ 5జీ ఫోన్‌​

Published on Fri, 06/13/2025 - 21:29

తక్కువ బడ్డెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్‌ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్‌సెట్, ఎల్‌పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

లావా స్టోర్మ్ ప్లే 5జీ ధర
ఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.

👉  జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ

ఫీచర్లు..స్పెసిఫికేషన్లు

  • లావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.

  • ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్‌తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ లభిస్తుంది.

  • ఇందులో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

  • లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

  • సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

  • అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.

  • 2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)