Breaking News

రోజుకు రెండు లక్షలు దాటితే..?

Published on Wed, 10/22/2025 - 11:35

డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీల (Cash Transactions) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక రోజులో ఎంతమేరకు నగదు లావాదేవీలు జరపాలో చట్టపరమైన పరిమితి గురించి అవగాహన ఉండకపోవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం నగదును స్వీకరిస్తే ఎలాంటి నియమాలున్నాయో తెలుసుకుందాం. నిర్దిష్ట పరిమితికి మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానాలు, చివరికి ఆదాయపు పన్ను నోటీసు కూడా రావచ్చని గుర్తుంచుకోవాలి.

సెక్షన్ 269ఎస్టీ

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకే రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి అనుమతుల్లేవు. ఈ పరిమితులు సదరు నగదు లావాదేవీ వ్యక్తిగతమా లేక వ్యాపారమా అనే దానిపై ఆధారపడవు. అంటే అందరికీ వర్తిస్తుంది.

ఉదాహరణకు: ఒక వ్యక్తి తన కారును అమ్మి కొనుగోలుదారు నుంచి రూ.2.5 లక్షల నగదు అందుకుంటే అది ఆదాయపు పన్ను చట్టానికి విరుద్ధం అవుతుంది. రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ మీరు తీసుకున్న మొత్తం నగదుకు సమానమైన జరిమానా విధించవచ్చు. ఉదా.. మీరు ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం రూ.5 లక్షల నగదును స్వీకరిస్తే జరిమానా మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ జరిమానాను సెక్షన్ 271డీఏ కింద విధిస్తారు. నగదును స్వీకరించిన వ్యక్తి మాత్రమే దీనికి జవాబుదారీగా ఉంటారు.

ఆర్థిక వ్యవస్థలో నల్లధనం (Black Money), పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఉద్దేశించిన ప్రధాన చర్యల్లో భాగంగానే ఈ రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని విధించారు. బ్యాంకు బదిలీలు, చెక్కులు లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహించే అన్ని పెద్ద లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించాలంటే బ్యాంకు (NEFT, RTGS, IMPS), చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్, యూపీఐ లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ వ్యవస్థ

ఆదాయపు పన్ను శాఖ అసాధారణమైన లేదా అధిక విలువ గల నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా కరెంట్ ఖాతాలో రూ.50 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేయవచ్చు.

ఇదీ చదవండి: గోల్డ్‌ ఢమాల్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)