Breaking News

ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం

Published on Thu, 12/11/2025 - 11:17

ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్‌ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.

  • అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.

  • మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.

  • బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32,  బయలుదేరాల్సినవి-28.

  • ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్‌డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.

  • ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.

  • ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.

  • సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్‌ షెడ్యూల్‌లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: సవాళ్లపై భారత్‌ నజర్‌ వేయాల్సిందే!

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)