Breaking News

చిన్న సంస్థలకు ఏఐ దన్ను

Published on Fri, 12/19/2025 - 14:54

కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్‌ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీఎక్స్‌), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 6.4 కోట్ల ఎంఎస్‌ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.

నివేదికలో మరిన్ని అంశాలు..

  • కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్‌ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.

  • ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు.  

  • ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్‌లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.

  • ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.

  • 2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.

ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ

#

Tags : 1

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)