Breaking News

బడ్జెట్‌ రచయితలు వీరే..

Published on Sun, 02/01/2026 - 07:45

భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్ రూపకల్పన వెనుక ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఒక శక్తివంతమైన అధికారుల బృందం గత కొన్ని నెలలుగా శ్రమించింది.

బడ్జెట్ వెనుక ఉన్న వ్యక్తులు

నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి): బడ్జెట్ రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తూ భారత ఆర్థిక విధానాలను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్న నాయకురాలు.

అనురాధ్ ఠాకూర్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి): బడ్జెట్ తయారీలో ఈమె అత్యంత కీలక పాత్ర పోషించారు. వనరుల కేటాయింపు, వృద్ధి ప్రాధాన్యతలు, బడ్జెట్ పత్రాల తుది రూపకల్పనలో ఈమెది ప్రధాన నిర్ణయం.

ఆర్వింద్ శ్రీవాస్తవ (రెవెన్యూ కార్యదర్శి): బడ్జెట్‌లోని పన్నుల ప్రతిపాదనల బాధ్యతను ఈయన పర్యవేక్షించారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాల మార్పులపై కీలకంగా వ్యవహరించారు.

ఉమ్లున్మాంగ్ ఉల్నమ్‌ (వ్యయ కార్యదర్శి): ప్రభుత్వ ఖర్చులు, వివిధ పథకాలకు సబ్సిడీల కేటాయింపులను సమన్వయం చేస్తూ నిధుల దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించారు.

ఎం.నాగరాజు (ఆర్థిక సేవల కార్యదర్శి): బ్యాంకింగ్ రంగం బలోపేతం, బీమా, పెన్షన్ వ్యవస్థల వృద్ధిపై దృష్టి సారించారు.

అరునిష్ చావ్లా (దీపమ్‌ కార్యదర్శి): ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.

కె.మోసెస్ చాలై (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి మూలధన వ్యయాన్ని పర్యవేక్షించారు.

వి.అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశీయ వృద్ధి రేటు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రధాన లక్ష్యాలు.. వ్యూహాలు

ఈ బడ్జెట్ ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు నియంత్రణ మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి సారించనుందని అంచనాలున్నాయి. వికసిత్‌ భారత్ 2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగ సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)