ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
Breaking News
10 నెలల రీఛార్జ్‌తో.. 15 నెలల వ్యాలిడిటీ!
Published on Tue, 11/10/2026 - 13:51
దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ జియో తన జియోహోమ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇంట్లో వైఫై, టీవీ, ఓటీటీ సేవలను ఉపయోగించే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
కంపెనీ ఆఫర్ ప్రకారం.. ఇప్పటికే జియోహోమ్ ఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఉపయోగిస్తున్న కస్టమర్లు 10 నెలల రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 5 నెలల సేవలను ఉచితంగా పొందవచ్చు. అంటే 10 నెలలకు డబ్బులు చెల్లిస్తే మొత్తం 15 నెలల పాటు వైఫై సేవలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందన్నమాట. పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు జియో ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఆఫర్‌లో భాగంగా నెలకు రూ.666 ప్లాన్‌తో 10 నెలల రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మొత్తం రూ.6,660 చెల్లించాలి. ఇలా రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగా మరో 5 నెలల వ్యాలిడిటీని జియో ఉచితంగా అందిస్తుంది. అంటే మధ్యలో మరోసారి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మొత్తం 15 నెలల పాటు సేవలను పొందవచ్చు.
తరచూ ఇంటర్నెట్ ఉపయోగించే కుటుంబాలకు, టీవీ ఛానళ్లు చూసేవారికి, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవారికి ఈ ఆఫర్ కొంత డబ్బు ఆదా చేసే అవకాశం కల్పిస్తుంది.
ఆఫర్‌ను ఎలా పొందాలంటే
ఇప్పటికే జియోహోమ్ కనెక్షన్ ఉన్న కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8219582195 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఆ తర్వాత జియో నుంచి అదే మొబైల్ నంబర్‌కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లో ఇచ్చిన సూచనలను పాటిస్తే ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ ఆఫర్ కోసం తప్పనిసరిగా జియోహోమ్ కనెక్షన్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచే మిస్డ్ కాల్ ఇవ్వాలి.
కొత్తగా కనెక్షన్ తీసుకుంటే..
కాగా.. కొత్తగా జియోహోమ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి కూడా జియో మరో ఆఫర్ ప్రకటించింది. రెండు నెలల ప్లాన్ ధర చెల్లిస్తే మూడు నెలల పాటు సేవలను పొందవచ్చు. ఈ రెండు నెలల ప్లాన్ ధర రూ.2,122గా ఉంది. ఈ ప్లాన్‌లో గరిష్ఠంగా 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. దీంతో పాటు.. జియోహోమ్ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే కొత్తగా కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి కూడా అదనంగా ఒక నెల సేవ ఉచితంగా లభిస్తుంది.
జియోహోమ్ ప్రత్యేకత
జియోహోమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు వినోద సేవలను కూడా అందించడం. ఇందులో వైఫై సేవలు.. 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. ఇంట్లో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సినిమాలు, సీరియళ్లు, టీవీ కార్యక్రమాలు చూసేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో మార్పు.. నేటి ధరలు ఇలా..
Tags : 1