Breaking News

జియో కొత్త చౌక రీచార్జ్‌ ప్లాన్లు వచ్చేశాయ్‌..

Published on Sat, 10/31/2026 - 16:05

టెలికాం రంగంలో వాయిస్‌-ఓన్లీ రీఛార్జ్‌ ప్లాన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాటలోనే కొత్త ప్రీపెయిడ్‌ వాయిస్‌-ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక రీఛార్జ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. రూ.147 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, వీటిలో మొబైల్‌ డేటా ఉండదు.

జియో కొత్త వాయిస్‌-ఓన్లీ ప్లాన్ల వివరాలు

రూ.147 ప్లాన్‌: ఈ రీఛార్జ్‌ ప్యాక్‌ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యవధిలో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.

రూ.177 ప్లాన్‌: 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

రూ.196 ప్లాన్‌: 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

రూ.197 ప్లాన్‌: ఈ రీఛార్జ్‌ ప్యాక్‌లో అపరిమిత కాలింగ్‌, రోజుకు 300 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. క్యాలెండర్‌ నెల ప్రాతిపదికన అంటే నెలలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది.

దీర్ఘకాలిక ప్లాన్లు కూడా..

జియో ఇప్పటికే అందిస్తున్న రూ.448, రూ.1,748 వాయిస్‌-ఓన్లీ ప్లాన్లు కూడా కొనసాగుతున్నాయి. వీటిలో వరుసగా 84 రోజులు, 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వీటితో పాటు జియో టీవీ, జియోఏఐ లౌడ్‌ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్లాన్లలోనూ మొబైల్‌ డేటా ప్రయోజనాలు ఉండవు.

ఎవరికి ఉపయోగం?
                                                                                                                          
స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ వినియోగం అవసరం లేని వారు, ఫీచర్‌ ఫోన్లు వాడేవారు, ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నవారు, వై-ఫై ద్వారా మాత్రమే ఇంటర్నెట్‌ ఉపయోగించే వారికి ఈ వాయిస్‌-ఓన్లీ ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయి. డేటా అవసరం లేకుండా కాలింగ్‌ సేవల కోసం మాత్రమే రీఛార్జ్‌ చేసుకునే వారికి ఇవి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.

డేటా కూడా కావాలంటే..

కాలింగ్‌తో పాటు కొంత మొబైల్‌ డేటా కూడా కావాలనుకునే వినియోగదారులు జియో రూ.189 ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఈ ప్యాక్‌ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు, మొత్తం 2 జీబీ డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియోఏఐ లౌడ్‌ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇదీ చదవండి: జియో 98 రోజుల ప్లాన్‌.. అదనపు ప్రయోజనాలివే!

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)