Breaking News

జియోకు పదేళ్లు.. తెలంగాణలో ఘనంగా దశాబ్ది వేడుకలు

Published on Sun, 09/06/2026 - 18:18

హైదరాబాద్‌: దేశ డిజిటల్‌ కనెక్టివిటీ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన రిలయన్స్‌ జియో తన ప్రయాణంలో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2016లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి డిజిటల్‌ సేవలను చేరువ చేసింది. ఈ సందర్భంగా సంస్థ తెలంగాణ విభాగంలో ఉద్యోగులు, నాయకులు, భాగస్వాములతో కలిసి దశాబ్ది వేడుకలను నిర్వహించారు.

తెలంగాణలో ప్రారంభ దశ నుంచి క్రమంగా విస్తరించిన జియో.. ప్రస్తుతం మొబిలిటీ, హోమ్‌, ఎంటర్‌ప్రైజ్‌ విభాగాల్లో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకుంది. గత పదేళ్లలో సాధించిన విజయాలు, సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు అందించిన సహకారం, ఈ ప్రయాణంలో ఏర్పడిన నైపుణ్యాలు, అనుభవాలను వేడుకల్లో గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి మాట్లాడుతూ.. తొలి దశాబ్దంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న పదేళ్లు మరింత ఉత్సాహభరితంగా ఉండనున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత జీవితం, వ్యాపారంలోని ప్రతి అంశాన్ని మరింతగా మార్చబోతోందని, 5జీ, కనెక్టెడ్‌ హోమ్స్‌, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త సేవల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఇదీ చ‌ద‌వండి: డిజిట‌ల్ విప్ల‌వం జియో ప‌దేళ్ల ప్ర‌స్థానం

దశాబ్ది వేడుకల్లో ఉద్యోగుల గుర్తింపు కార్యక్రమాలు, స్మారక అవార్డుల ప్రదానం, కేక్‌ కటింగ్‌ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు, వారి కుటుంబాలు, భాగస్వాములు అందించిన సహకారానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Videos

కాబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి? రేవంత్ సభతో పెరిగిన హీట్!

ఇదేం ప్రజాపాలన చీర ఎలా లాగేస్తారు? సునీత లక్ష్మారెడ్డి ఎమోషనల్

ఉద్యోగులు ఉద్యమానికి దిగితే నీ పరిస్థితి... కేకేరాజు మాస్ వార్నింగ్

అసెంబ్లీ ఘటన తర్వాత తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాపై ట్రోలింగ్స్

కడప DSC లో మరో బాగోతం.. విచారణలో షాకింగ్ విషయాలు!

అసెంబ్లీ వద్ద హైటెన్షన్.. సబితా ఇంద్రారెడ్డిని మెడ పట్టి తోసేసిన పోలీసులు

మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్.. 'కాకా' పై బాబీ కీలక అప్డేట్..!

సీనియర్లకు బంపర్ ఆఫర్.. SBI స్పెషల్ FD స్కీమ్ వడ్డీ ఎంతంటే?

అసెంబ్లీ వద్ద రచ్చ రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు ను ఈడ్చుకెళ్ళిన పోలీసులు

Photos

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)