Breaking News

పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఈసారి ఎంతంటే?

Published on Sun, 10/11/2026 - 15:12

మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ.. రీఛార్జ్ అనేది తప్పనిసరి ఖర్చుగా మారింది. ఇలాంటి సమయంలో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను మరోసారి పెంచడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే నాలుగు నుంచి ఐదు నెలల్లో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను 12 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అయితే.. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ కూడా ధరల పెంపుపై అధికారిక ప్రకటన చేయలేదు.

టెలికాం రంగంలో పోటీ తగ్గడం.. ధరలు పెరిగే అవకాశానికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన ప్రైవేట్ కంపెనీలు మార్కెట్‌లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ 12 నుంచి 15 శాతం ధరల పెంపు అమలైతే.. ప్రస్తుతం రూ.299 ఉన్న రీఛార్జ్ ప్లాన్ ధర సుమారు రూ.335 నుంచి రూ.344 వరకు చేరవచ్చు. అదే విధంగా రూ.349 ప్లాన్ ధర దాదాపు రూ.391 నుంచి రూ.401 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. కంపెనీలు నిజంగా ధరలు పెంచితే ఏ ప్లాన్ ధర ఎంత మారుతుందనేది వాటి అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌: 28 రోజుల ప్లాన్.. 42జీబీ డేటా!

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)