Breaking News

బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా?

Published on Sun, 05/21/2023 - 20:08

రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే జువెలరీ షాపులకు ఎంక్వైరీలు వెల్లువెత్తాయి.  బంగారం కొనుగోలుకు రూ.2 వేల నోట్లు స్వీకరిస్తారా అని కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు జువెలరీ దుకాణాల్లో ఆరా తీస్తున్నారు. 

అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు
అయితే 2016లో నోట్ల రద్దు సమయంలో కనిపించిన ఉధృత పరిస్థితి ఇప్పుడు లేదని జువెలర్స్ బాడీ జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. వాస్తవానికి రూ.2 వేల నోట్ల మార్పిడి, కఠిన కేవైసీ నిబంధనల నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగారం కొనుగోళ్లు మందగించాయి. 

10 శాతం వరకు అధిక ధర!
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో కొంతమంది బంగారు వ్యాపారులు కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి.  బంగారం కొనుగోలు కోసం రూ.2 వేలు నోట్లు ఇచ్చే కస్టమర్ల నుంచి 5 నుంచి 10 శాతం అదనంగా తీసుకున్నట్లు తెలిసింది. 10 గ్రాముల గ్రాముల బంగారాన్ని రూ. 66,000 వరకు అమ్మినట్లు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో బంగారం ధర తులం రూ.60,200 మేర ఉంది. కాగా రూ. 2 లక్షల లోపు బంగారం, వెండి ఆభరణాలు, రత్నాల కొనుగోలు కోసం పాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లను కస్టమర్లు సమర్పిచాల్సిన అవసరం లేదు.

‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు కస్టమర్ల నుంచి జువెలరీ షాపులకు అధిక సంఖ్యలో ఎంక్వైరీలు వచ్చాయి. అయితే కఠినమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవ కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి’ అని జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్  చైర్మన్ సయమ్ మెహ్రా పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి  ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది. ఆ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి, బ్యాంకుల్లో మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. మరోవైపు రూ.2000 నోట్ల చలామణిని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులను కోరింది.

ఇదీ చదవండి: RS 2000 Note: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)