Breaking News

రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...

Published on Sat, 06/21/2025 - 21:37

ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.

61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్‌తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.

ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్‌ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల  ఆందోళన.

విలాసవంతమైన నావపై..
వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే  మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.

గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..
పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

భారీగా పెళ్లి ఖర్చు
వెనిస్ లో బెజోస్, సాంచెజ్‌ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం..  ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్‌ సింగర్‌ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు