Breaking News

ఐటీ రిటర్న్‌ కొత్త డెడ్‌లైన్‌.. మిస్‌ అయితే పెద్ద తలనొప్పే!

Published on Wed, 07/23/2025 - 20:44

దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్‌ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.

ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్‌లైన్‌
2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.

గడువు దాటిపోతే పర్యవసానాలు
ఐటీఆర్‌ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.

ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.

నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.

👉 ఇదీ చదవండి: రూ.75 లక్షల జాబ్ ఆఫర్.. అంత ట్యాక్స్‌ కట్టి అవసరమా?

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)