Breaking News

ఐటీ రిటర్న్స్‌ గడువు పెంపు అందరికీనా?

Published on Wed, 02/04/2026 - 15:29

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు ఇటీవల 2026-27 బడ్జెట్‌లో ప్రకటించడంతో, ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులందరికీ  వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.

పీక్ ఫైలింగ్ సీజన్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారీ ఫైలింగ్ టైమ్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ సడలింపు ఎంపిక చేసిన కొన్ని కేటగిరీల ట్యాక్స్‌ పేయర్స్‌కు మాత్రమే పరిమితం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే, అదనపు సమయం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉంటుందని, మిగతావారు ప్రస్తుత గడువునే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

జూలై 31 గడువు ఎవరికీ వర్తిస్తుంది?
వేతన పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు, జీతం, వడ్డీ లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందేవారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు జూలై 31 గడువే కొనసాగుతుంది. వీరికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. అందువల్ల, వారు మునుపటిలాగే తమ ఫైలింగ్ ప్రణాళికలను కొనసాగించాలి.

ఆగస్టు 31 ఎవరికి?
ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ బిజినెస్ కేసులు), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు మాత్రమే జూలై 31కి బదులుగా ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(1)(c) కింద ఈ పొడిగింపు వర్తిస్తుంది.

ఎప్పటి నుంచి అమల్లోకి..?
ఈ కొత్త గడువు పన్ను సంవత్సరం 2026–27 నుంచి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద సవరణలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఇదే మార్పులు అమలు చేస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)