Breaking News

81,000 దాటిన సెన్సెక్స్‌

Published on Fri, 07/19/2024 - 04:54

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్‌(3%), ఇన్ఫోసిస్‌(2%), రిలయన్స్‌(1%), ఐసీఐసీఐ బ్యాంక్‌(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్‌ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్‌ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. 

నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్‌ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్‌ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. 

→ ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్‌ పెంచాయి. ఎల్‌టీఐఎం 3.50%, టీసీఎస్‌ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్‌ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి.  

రూపాయి రికార్డ్‌ కనిష్టం @ 83.63 
దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)