Breaking News

బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!

Published on Thu, 07/30/2026 - 17:51

చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.

రూ.95 లక్షలకు పైగా ఆస్తులు

రెడిట్‌ పోస్ట్‌ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్‌డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యం

ఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.

తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్‌డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ రెడిట్‌ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)