Breaking News

హోర్ముజ్ జలసంధి మూసివేత..?

Published on Mon, 06/16/2025 - 11:56

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌ ఆధ్వర్యంలోని హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే యుద్ధం నేపథ్యంలో దీని గుండా చేసే చమురు సరఫరాను నిలిపేస్తామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% రవాణాను సులభతరం చేస్తుంది.

ఇరాన్‌-గల్ఫ్‌ దేశాల మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్‌లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్‌గా పనిచేస్తుంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు, ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. దీని గుండా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే తీవ్రమైన సరఫరా గొలుసు అవరోధాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతుందని చెబుతున్నారు.

ముడిచమురు ధరలపై కీలక ప్రభావం

సరఫరా అంతరాయాలు

అమెరికా, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్‌కు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆంక్షల వల్ల ప్రపంచ క్రూడ్‌ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది చమురు ధరలు పెరగడానికి, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటానికి దారితీస్తుంది.

మార్కెట్ ఒడిదొడుకులు

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ 10% పైగా పెరగడానికి దారితీశాయి. ఇది దీర్ఘకాలిక సంక్షోభంతో కూడిన మార్కెట్ భయాలను ప్రతిబింబిస్తుంది. పశ్చిమాసియాలో అస్థిరతపై పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

పరిశ్రమలపై ప్రభావం..

పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెయింట్స్, కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్‌పై ఆధారపడతాయి. టైర్లు, రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి. ఏవియేషన్, షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్‌

రష్యాకు అవకాశం..

హోర్ముజ్ జలసంధి దిగ్బంధం చేస్తారనే భయాలతో రష్యన్ క్రూడాయిల్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ ఆంక్షల తరువాత ఇప్పటికే రష్యన్ చమురు రాయితీతో లభిస్తుంది. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను పెంచాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్‌ ఇలాగే హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను నిలిపేస్తామని ఇరాన్‌ భయాలు సృష్టిస్తే గల్ఫేతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుందనే వాదనలున్నాయి.

ఇరాన్ బెదిరింపుల వెనుక కారణాలు

ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెబుతామని ఇరాన్ ప్రతిస్పందించింది.  అందులో భాగంగా హోర్ముజ్ జలసంధిని నిలిపేయడం దాని వ్యూహాత్మక ఎంపికల్లో ఒకటి. ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం. ఇది ప్రపంచ ముడి చమురులో 20% రవాణాకు తోడ్పడుతుంది. దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇరాన్ చారిత్రాత్మకంగా హోర్ముజ్‌ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది. కానీ ఎన్నడూ దాన్ని నిలిపేయలేదు.

పూర్తి మూసివేత సాధ్యం అవుతుందా..?

ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. యూఎస్‌ నేవీ ఐదో ఫ్లీట్ యూకే, ఫ్రెంచ్ మిత్రదేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తుంది. దీన్ని పూర్తిగా నిలిపేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)