Breaking News

ఐవోసీ భారీ కాంట్రాక్ట్‌..

Published on Sat, 02/15/2025 - 08:22

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ను (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ విలువ 7–9 బిలియన్‌ డాలర్లు. ఏడీఎన్‌ఓసీ గ్యాస్‌తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఏడీఎన్‌ఓసీ గ్యాస్‌ సరఫరా చేయనుంది.

ఇండియా ఎనర్జీ వీక్‌ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తోనూ (బీపీసీఎల్‌) ఏడీఎన్‌ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్‌ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్‌ఎన్‌జీ విక్రయించేందుకు ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్‌ చేతులు కలిపింది.

బీపీసీఎల్‌ ఈ సందర్భంగా బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌తో 6 మిలియన్‌ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్‌ సామర్థ్యంతో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్‌ పవర్‌తో బీపీసీఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.  

బీహెచ్‌ఈఎల్‌కు రూ.6,700 కోట్ల ఆర్డర్‌ 
ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ తాజాగా సింగరేణి కాలరీస్‌ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు  తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్‌ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్‌ పనులను  చేపడుతుంది.

ప్రతిపాదిత యూనిట్‌ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్‌ఈఎల్‌ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్‌ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్‌ను బీహెచ్‌ఈఎల్‌ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా  సామర్థ్యం గల విద్యుత్‌ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)