Breaking News

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు డిమాండ్‌.. వందల కోట్లలో పెట్టుబడులు!

Published on Wed, 05/17/2023 - 09:29

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు గత నెల పసిడి ఎక్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌) గణనీయంగా ఇన్వెస్ట్‌ చేశారు. మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ) గణాంకాల ప్రకారం రూ. 124 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు మందు నెల మార్చ్‌లో రూ. 266 కోట్లు ఉపసంహరించుకున్నారు. 

సంపన్న ఎకానమీల్లో ఇంకా రిస్కులు కొనసాగుతున్నందున గోల్డ్‌ ఈటీఎఫ్‌లవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మార్నింగ్‌స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. డేటా ప్రకారం పసిడి ఆధారిత 14 ఈటీఎఫ్‌ల్లోకి గత నెల రూ. 124.54 కోట్లు వచ్చాయి. దీంతో పసిడి ఈటీఎఫ్‌ల నిర్వహణనలోని ఆస్తుల పరిమాణం రూ. 22,950 కోట్లకు చేరింది. 

మార్చి నెలాఖరులో ఇది రూ. 22,737 కోట్లు. ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య 12,600 పెరిగి 47.13 లక్షలకు చేరింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 653 కోట్ల పెట్టుబడులు వచ్చాయ. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2021–22లో నమోదైన రూ. 2,541 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించాయి. ప్రధానంగా లాభాల స్వీకరణ, ఇన్వెస్టర్లు .. ఈక్విటీలవైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)