Breaking News

జనరేటివ్‌ ఏఐతో కొత్త ఉద్యోగాలు

Published on Wed, 01/24/2024 - 12:10

న్యూఢిల్లీ: జనరేటివ్‌ ఏఐ (కృత్రిమ మేథ)పై ప్రభుత్వ పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, ఓపెన్‌సోర్స్‌ కంటెంట్‌ అన్నవి దేశంలో ఉపాధి కల్పనను మరింత పెంచుతాయని, అసమానతలను తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

‘‘జనరేటివ్‌ ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. పరిమిత నైపుణ్యాలున్న వారు సైతం ఉన్నత శ్రేణి ఉద్యోగాలను నిర్వహించేందుకు సాయపడుతుంది. ఇది ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది’’అని ఐఎంటీ ఘజియాబాద్‌ డైరెక్టర్‌ విశాల్‌ తల్వార్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు బలమైన మౌలిక వసతుల కల్పన అవసరమంటూ.. రానున్న బడ్జెట్‌లో ఇందుకు ప్రత్యే కేటాయింపులు చేయాలని జెనరేటివ్‌ ఏఐపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తల్వార్‌ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపార విద్య రూపాంతరంపై కీలకంగా చర్చించారు. భారత్‌ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఏఐ కార్యక్రమాలు, ఏఐ మిషన్‌తో ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన విషయంలో దేశం గణనీయమైన పురోగతికి సిద్ధంగా ఉందని తల్వార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్లడమే కాకుండా, వేగంగా మారిపోతున్న ఉద్యోగ ముఖ చిత్రంలో వ్యక్తుల నైపుణ్యాలకు సాధికారతను జనరేటివ్‌ ఏఐ తీసుకొస్తుందన్నారు. 

భారత కంపెనీలు ఇప్పటికే రూపొందించిన టూల్స్, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో జనరేటివ్‌ ఏఐ విభాగంలో కీలక పాత్ర పోషించగలవని ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీకి చెందిన కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషర్‌ మోహాంబిర్‌ సావ్నే పేర్కొన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)