amp pages | Sakshi

ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తే మేలు

Published on Mon, 06/13/2022 - 08:14

నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? – సిర్ముఖుద్దమ్‌  
మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్‌ ఫండ్‌ లేదా అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగానూ అనుకూలంగా ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే డెట్‌ ఫండ్‌ అయితే పెట్టుబడి మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. ద్రవ్యోల్బణ తరుగు ప్రభావం మినహాయించిన తర్వాత మిగిలిన లాభంపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ డెట్‌ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్లలోపు ఉపసంహరించుకుంటే అప్పుడు లాభం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే ఆదాయానికి కలుస్తుంది. అయితే, ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్‌ ఫండ్స్‌ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్‌ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ తక్కువ రిస్క్‌ విభాగంలోకి వస్తాయి. కాకపోతే, నాణ్యమైన డెట్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్‌ తీసుకున్నట్టు అవుతుంది.

నాకు ఎన్‌పీఎస్‌ పథకంలో టైర్‌ 1, టైర్‌ 2 ఖాతాలున్నాయి. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్‌ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్‌ అలోకేషన్‌) ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్‌ బాండ్స్‌లో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్‌ 
గిల్ట్‌ ఫండ్స్‌ లేదా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల్లో అస్థిరతలు.. షార్ట్‌ డ్యురేషన్‌ లేదా కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువ. ఎందుకంటే గిల్ట్‌ ఫండ్స్‌ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్‌ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్‌ రిస్క్‌ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. వడ్డీరేట్లు పెరుగుతున్నాయి కనుక, స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. అందుకని సమీప కాలానికి ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు సైతం అంత చక్కని ప్రదర్శన ఇవ్వవు. అయితే, ఈ అస్థిరతలు ఎప్పుడూ కూడా స్వల్పకాలంలోనే. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో చూసుకుంటే గిల్ట్‌ ఫండ్స్‌లో రాబడులు ఏమీ లేవని చెప్పుకోవాలి. కానీ మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ మాదిరే గిల్ట్‌ ఫండ్స్‌ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్‌పీఎస్‌ టైర్‌ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్‌ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. కనుక పెట్టుబడులపై, రాబడులపై అంత ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదు. ప్రస్తుత వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను మీరు తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ  ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో మీరు యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. కనుక కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్‌ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది.  

-  ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

చదవండి: మార్కెట్‌ అస్థిరతలను తట్టుకోవడం ఎలా?

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)