Breaking News

65,000 మంది ఉద్యోగుల సహకారం!

Published on Wed, 12/10/2025 - 21:07

దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.

డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ​క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.

ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలు

ఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్‌లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లో కోతలు పెట్టింది.

ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)