Breaking News

10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు

Published on Wed, 11/13/2024 - 18:59

ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.

బాలీలోని ఈస్ట్‌ నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్‌ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.

ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన

బాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్‌ నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)