Breaking News

విదేశీ పెట్టుబడులు డౌన్‌

Published on Tue, 03/04/2025 - 04:54

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25, క్యూ3)లో ఎఫ్‌డీఐలు 5.6 శాతం తగ్గి 10.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో దేశంలోకి 11.55 బిలియన్‌ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ.. 

→ 2024–25 జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో 13.6 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. వార్షికంగా 43 శాతం పెరిగాయి. 
→ ఏప్రిల్‌–డిసెంబర్‌ తొమ్మిది నెలల కాలానికి చూస్తే 27 శాతం ఎగసి, 40.67 డాలర్లను తాకాయి. 2023–24 ఇదే కాలంలో దేశంలోకి వచి్చన ఎఫ్‌డీఐల విలువ 32 బిలియన్‌ డాలర్లు. 
→ ఈక్విటీ పెట్టుబడులు, తిరిగి ఇన్వెస్ట్‌ చేసిన లాభాలు, ఇతర మూలధన పెట్టుబడులు తొలి తొమ్మిది నెలల్లో 21.3 శాతం వృద్ధితో 62.48 బిలియన్‌ డాలర్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 51.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 
→ భారీగా ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టబడులు వెచి్చంచిన దేశాల్లో సింగపూర్‌ (12 బిలియన్‌ డాలర్లు), అమెరికా (3.73 బి.డాలర్లు), నెదర్లాండ్స్‌ (4 బి.డాలర్లు), యూఏఈ (4.14 బి.డాలర్లు), సైప్రస్‌ (1.8 బి.డాలర్లు) నిలిచాయి. 
→ మారిషస్, జపాన్, యూకే, జర్మనీ నుంచి ఎఫ్‌డీఐలు క్షీణించాయి. 
→ రంగాల వారీగా చూస్తే, సేవల రంగ కంపెనీలకు తొలి 9 నెలల్లో అత్యధికంగా 7.22 బిలియన్‌ డాలర్లు లభించాయి. 
→ పునరుత్పాదక రంగం 3.5 బిలియన్‌ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించింది. 
→ మహారాష్ట్ర అత్యధికంగా 16.65 బిలియన్‌ డాలర్లను చేజిక్కించుకోగా, తర్వాత స్థానాల్లో కర్నాటక (4.5 బిలియన్‌ డాలర్లు), గుజరాత్‌ (5.56 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.  

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు