Breaking News

Indian stock market: భారీ లాభాలకు అవకాశం

Published on Mon, 06/10/2024 - 05:49

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్‌ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.

 డాలర్‌ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్‌ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది.  ఎగ్జిట్‌ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది.  

కళ్లన్నీ ఫెడ్‌ సమావేశం పైనే..! 
అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్‌ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్‌ రిజర్వ్‌ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్‌లోనా.? డిసెంబర్‌లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. 

ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి 
దేశీయంగా మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్‌ 12న, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్‌ 14న విడుదల కానున్నాయి. రిటైల్‌ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.

రూ.14,794 కోట్ల అమ్మకాలు 
దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్‌ మార్కెట్‌లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)