Breaking News

స్పేస్‌టెక్‌ స్టార్టప్స్‌లోకి నిధుల వెల్లువ

Published on Wed, 07/29/2026 - 05:57

ముంబై: స్పేస్‌టెక్‌ అంకుర సంస్థల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. డేటా ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ప్రకారం ఇప్పటివరకు 871 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. 285 కంపెనీలు 241 విడతల్లో ఈ మొత్తాన్ని సమీకరించాయి. ఇటీవలే విక్రమ్‌–1 లాంచ్‌ వెహికల్‌తో రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ సంస్థ స్కైరూట్‌లోకి అత్యధికంగా 150 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఇది దేశీయంగా తొలి స్పేస్‌టెక్‌ యూనికార్న్‌గా (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌) నిలి్చంది. ఈ ఏడాది మే నెలలో కంపెనీ 1.1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో నిధులను సమకూర్చుకున్నట్లు డేటాలో వెల్లడైంది. స్పేస్‌టెక్‌ కంపెనీలు బైటి నుంచి నిధులను సేకరించిన మొత్తం 871 మిలియన్‌ డాలర్లలో టాప్‌ 10 కంపెనీల వాటా ఏకంగా 60 శాతంగా ఉంది.  

డేటాలో మరిన్ని విశేషాలు.. 
⇒ 106 విడతల్లో 495 మిలియన్‌ డాలర్ల సమీకరణతో బెంగళూరు స్పేస్‌టెక్‌ స్టార్టప్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. నిధులు దక్కించుకున్న టాప్‌ 10 సంస్థల్లో ఆరు స్టార్టప్‌లు బెంగళూరులోనే ఉన్నాయి.  

⇒  బెంగళూరుకు చెందిన పిక్సెల్‌ (96 మిలియన్‌ డాలర్లు), అగి్నకుల్‌ కాస్మోస్‌ (76 మిలియన్‌ డాలర్లు), దిగంతర (67 మిలియన్‌ డాలర్లు) సంస్థలు స్కైరూట్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

⇒  ప్రభుత్వ రంగ ఇస్రో ఆధిపత్యం ఉన్న రంగంలో ప్రైవేట్‌ కంపెనీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి స్పేస్‌టెక్‌ స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2021లో 43 మిలియన్‌ డాలర్లు రాగా 2025లో 200 మిలియన్‌ డాలర్లు పైగా వచ్చాయి.  
⇒  2026లో స్టార్టప్‌లు ఇప్పటివరకు 24 విడతల్లో 113 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకున్నాయి.   
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)