Breaking News

వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం

Published on Thu, 05/15/2025 - 19:19

ఎలాన్ మస్క్ అనగానే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అని అందరూ చెబుతారు. అయితే ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ, వారానికి ఈయన ఎన్ని గంటలు పనిచేస్తారో తెలిస్తే.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టెస్లాలోని ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ చైర్మన్ 'అశోక్ ఎల్లుస్వామి' ఒక పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడని వ్యక్తి అని అభివర్ణించారు. అద్భుతమైన ఊహ, దూరదృష్టి కలిగిన మస్క్ వారానికి 80 గంటల నుంచి 90 గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు.

నేను ప్రతివారం మస్క్‌ను కలుస్తాను. అతను చాలా తెలివైనవాడు, భవిష్యత్తును చాలా ముందుగానే అంచనా వేయగలడు. అతని దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడడు. కష్టపడి పనిచేసే తత్త్వం ఉన్న మస్క్.. చాలా సరదాగా ఉంటారని అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?

2014లో టెస్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరిన ఎల్లుస్వామి.. దశాబ్దానికి పైగా కంపెనీలో ఉన్నారు. 2024లో AI సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొంది.. మస్క్‌తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధస్సులో టెస్లా వృద్ధికి దోహదపడుతున్నారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)