Breaking News

ఫేక్‌, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

Published on Tue, 02/17/2026 - 20:26

కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ఫేక్‌ కంటెంట్‌ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్‌కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్‌పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. 

తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూసిన ఫేక్‌ కంటెంట్‌ గురించి సంబంధిత ఫ్లాట్‌ఫామ్‌ యాజమాన్యానికి నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్‌బుక్‌లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే,  ఫేస్‌బుక్‌ గ్రివెన్సెస్‌ ఆఫీసర్‌కి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి.  ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగిస్తుంది. 

అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.

మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్‌ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. 

ఏఐ కంటెంట్‌పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్‌ఫేక్‌లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ అప్‌లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.

ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్‌ హార్బోర్‌ ప్రొటెక్షన్‌ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్‌పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్‌కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)