‘నెలకు రూ.2 లక్షల స్టైపెండ్‌’.. పుచ్‌ఏఐ సీఈఓ ప్రకటన

Published on Thu, 08/07/2025 - 13:56

నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు ఇస్తారు.. ఇది వేతనం అనుకుంటే పొరపాటే. ఓ కంపెనీ ప్రకటించిన ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌! పుచ్ ఏఐ సహ వ్యవస్థాపకులు, సీఈఓ సిద్ధార్థ్‌ భాటియా తన ఎక్స్‌ ఖాతాలో ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. తన కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలున్నాయని చెబుతూ.. అందుకు సంబంధించిన వివరాలను సైతం పబ్లిక్‌ డొమైన్‌లో ప్రకటించడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్‌ భాటియా ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘మేం రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించాం. లక్షల మందికి ఉపయోగపడేలా ఏఐని రూపొందించడానికి puch_ai కంపెనీలో చేరండి.

  • స్టైపెండ్‌: నెలకు రూ.1 లక్షల నుంచి రూ.2 లక్షలు

  • మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు చేరవచ్చు.

  • రిమోట్‌గా పని చేయవచ్చు.

  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి.

  • డిగ్రీ అవసరం లేదు.

  • మేము గత నెలలో ఒక హైస్కూల్ విద్యార్థిని నియమించుకున్నాం.

ఓపెన్ రోల్స్:

1. ఏఐ ఇంజినీరింగ్ ఇంటర్న్ (ఫుల్ టైమ్)

2. గ్రోత్ మెజీషియన్ (ఫుల్ టైమ్/పార్ట్‌టైమ్‌)

ఈ ఖాళీలపై ఆసక్తిగా ఉందా?

మేము మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలో.. మీరు పుచ్ ఏఐలో చేరితే దేనిపై పనిచేయడానికి ఇష్టపడుతారో కామెంట్‌ చేయండి. పర్‌ఫెక్ట్‌గా సరిపోయే వ్యక్తి ఎవరో తెలిస్తే వారిని నెటిజన్లు ట్యాగ్ చేయవచ్చు. ట్యాగ్‌ చేసిన వారిని నియమించుకుంటే ఐఫోన్ గెలుచుకుంటారు.

మేం కూడా హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. అందులో గెలిస్తే ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ లభిస్తుంది. టాప్ 10లో చోటు దక్కించుకుంటే వ్యవస్థాపకులు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిజిస్టర్ చేసుకోవాంటే http://puch.ai/hackathon పై క్లిక్‌ చేయండి’ అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌పై టెకీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ వ్యాఖ్యలపై ఉద్యోగార్థులు తమ లక్ష్యాలను, ఇప్పటి వరకు తాము చేసిన పనిని వివరిస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను

ఏఐ టాలెంట్‌ హంటింగ్‌..

కృత్రిమమేధ టూల్స్‌కు డిమాండ్‌ పెరుగుతుండడంతో స్థాయితో సంబంధం లేకుండా దాదాపు చాలా టెక్‌ కంపెనీలు ఏఐ టాలెంట్‌ హంటింగ్‌ రేసులో పడ్డాయి.  మెటా, ఎక్స్‌ఏఐ వంటి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి ఏఐ నిపుణులను నియమించుకుంటున్నాయి. చిన్న కంపెనీలు కూడా ఏఐ టాలెంట్‌ను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. అందుకోసం విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)